TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్.ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గిరిజనేతర పేదలు, ఇంకా పట్టాలు పొందని గిరిజనులకు హక్కు పత్రాలు ఇవ్వాలని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. మండల అధ్యక్షుడు గాయం తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా నాయకులు మెరుగు సత్యనారాయణ, ఎర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ తరతరాలుగా ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్న గిరిజనేతర పేదలకు పట్టాలు ఇవ్వకపోవడం అన్యాయమని విమర్శించారు.

అటవీ హక్కుల చట్టం-2005 ప్రకారం అర్హులైన గిరిజనేతర పేదలకు కూడా హక్కు పత్రాలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వాలు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.పోడు భూములపైనే ఆధారపడి జీవిస్తున్న పేదలకు హక్కు పత్రాలు లేకపోవడంతో బ్యాంకు రుణాలు, ఎరువుల సబ్సిడీలు, ఇతర ప్రభుత్వ రాయితీలు అందడం లేదని నాయకులు తెలిపారు.

ఇప్పటికే సర్వేలు పూర్తై, గ్రామసభల ఆమోదం పొంది, డీఎల్సీ నంబర్లు కేటాయించినప్పటికీ హక్కు పత్రాలు జారీ చేయలేదని పేర్కొన్నారు. వెంటనే గిరిజనేతర పేదలకు పట్టాలు మంజూరు చేసి, పోడు సాగుదారులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మార్వోకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో సంఘం మండల కార్యదర్శి చిమట విశ్వనాథం, ఆర్ మంగమ్మ గుడిమెట్ల బాబు, చిట్టి మొదల కృష్ణయ్య, ప్రతాప్, వడ్డెగా బజార్, చిలకా రమణ, గొల్లమందల సరసమ్మ, జొన్నలగడ్డ రమణయ్య, కుంజ రాములు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *