TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్. అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న రోగులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఎల్వోసి లు అందించారు.
ఈ సందర్భంగా అత్యవసర శస్త్రచికిత్స అవసరమైన అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రానికి చెందిన పెంకే మోహన్ కి రూ.2,75,000/- విలువైన LOC చెక్కును అందజేశారు. అలాగే ములకలపల్లి మండలం మధారం పంచాయతీ మంగపేట గ్రామానికి చెందిన కుంజా వెంకటేశ్వర్లుకి రూ.2,50,000/- విలువైన LOC చెక్కును నేరుగా ఆసుపత్రిలోనే అందించి ఎమ్మెల్యే జారె ఆర్థిక భరోసా కల్పించారు.