ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం జగన్నాధపురంలో ఈ నెల 30న నిర్వహించనున్న “రైతు ఆశీర్వాద సభ” ఏర్పాట్లను ఉమ్మడి ఖమ్మం ఎమ్మెల్యేలు, జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి, వర్షాల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని జర్మన్ హ్యాంగర్లతో వసతులు కల్పించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని, ఇచ్చిన హామీలను అమలు చేస్తూ తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో సకాలంలో నగదు జమ చేసిందని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ రైతు ఆశీర్వాద సభకు లక్షలాది మంది రైతులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటితో పాటు ఎమ్మెల్యేలు కోరం కనకయ్య , పాయం వెంకటేశ్వర్లు , తెల్లం వెంకట్రావు , జారే ఆదినారాయణ, మట్టా రాగమయి దయానంద్ , రాందాస్ నాయక్ , రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు , సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ , కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ , తోట దేవీ ప్రసన్న , జిల్లా కలెక్టర్ దివాకర్. టిఎస్ , పోలీస్ కమీషనర్ సునీల్ దత్త్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *