TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, హైదరాబాద్, జులై 11. తెలంగాణ వీర మహిళల ప్రత్యేక సమావేశం జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జనసేన తెలంగాణ ప్రచార కార్యదర్శి సాగర్ ఆర్.కె. నాయుడు మాట్లాడుతూ… జనసేన ప్రస్థానంలో వీరమహిళల పాత్ర చాలా కీలకమైనదని అన్నారు.
తెలంగాణ సంస్కృతికి అనుగుణంగా వీరమహిళల నాయకత్వంలో పార్టీ కార్యక్రమాలు ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు తెవిపారు. ముఖ్యంగా తెలంగాణ బోనాల నిర్వహణకు వీరమహిళలు సమాయత్తం అవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జీ.హెచ్.ఎం.సీ.తో పాటుగా, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి వీరమహిళలు హాజరయ్యారు.