TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, కల్లూరు మండలం, జులై 11. కల్లూరు పట్టణానికి చెందిన కొంతమంది నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా, వారిని శనివారం కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మట్టా రాగమయి దయానంద్ పరామర్శించారు.
ఆసుపత్రికి విచ్చేసిన ఎమ్మెల్యే బాధితులను కలిసి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో స్వయంగా మాట్లాడి, బాధితుల ఆరోగ్య వివరాలను సేకరించారు. ప్రమాదంలో గాయపడిన వారికి ఎలాంటి లోటు లేకుండా అత్యంత మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆసుపత్రి వైద్యులకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడం సూచించారు. గాయపడిన బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్, కల్లూరు ఎఎంసి చైర్మన్ బాగం నీరజ, సీనియర్ నాయకులు పసుమర్తి చందర్ రావు, కల్లూరు మున్సిపల్ వైస్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు, కల్లూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొట్రూ అర్జున్ రావు, కల్లూరు పట్టణ అధ్యక్షులు ఉస్మాన్ మరియు కల్లూరు పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.