TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్స సత్తుపల్లి, జులై 16: సత్తుపల్లి నియోజకవర్గంలోని యతాలకుంటలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టన్నెల్ పనులను పరిశీలించేందుకు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ఘన స్వాగతం పలికారు. సత్తుపల్లి ప్రాంతానికి గోదావరి జలాలు అందించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికి శాశ్వత సాగునీటి భరోసా లభిస్తుందని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సీతారామ, సీతమ్మసాగర్, దేవాదుల వంటి సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరాకు గోదావరి జలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, రైతుల సంక్షేమం కోసం సాగునీటి రంగంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే సత్తుపల్లి నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయ రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే మట్టా రాగమయి దంపతులు పేర్కొన్నారు.