TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, సత్తుపల్లి, జూలై 21 ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జన్మదినాన్ని పురస్కరించుకొని సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.

రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కేక్ కట్ చేసి ఖర్గేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మట్టా దయానంద్ విజయకుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, దేశ ప్రజల సంక్షేమానికి మల్లికార్జున ఖర్గే అందిస్తున్న సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *