TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పెనుబల్లి మండలం, ఆగస్ట్ 16. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలోని రాతోనే లిఫ్ట్ మోటార్లకు కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ కి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ కి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు రాతోనే చెరువు, లిఫ్ట్ ఆయకట్టు ఉమ్మడి రైతులు వినతిపత్రం అందించారు.

సాధ్యమైనంత త్వరగా రాతోని లిఫ్ట్ సమస్యను పరిష్కరించి రైతులను ఆదుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ రైతుల సమక్షంలోనే ఉన్నతాధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా రాతోనే లిఫ్ట్ ట్రాన్స్ఫార్మర్ల సమస్యను పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. సమస్యను తెలుసుకొని తక్షణమే మట్టా దయానంద్ విజయ్ కుమార్ ఉన్నతాధికారులతో మాట్లాడటం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *