TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్. సత్తుపల్లి, సెప్టెంబర్ 27: కానిస్టేబుల్ ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడేలా సత్తుపల్లి JVR ప్రభుత్వ డిగ్రీ కళాశాల (A)లో నిర్వహించనున్న “CONTABLE 2026 – Mock Test” పోస్టర్ను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఆవిష్కరించారు.
కళాశాల కెరీర్ గైడెన్స్ & JKC ఆధ్వర్యంలో ఈ మాక్ టెస్ట్ను అక్టోబర్ 3వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు పరీక్షా విధానం, సమయపాలన, ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకునేందుకు ఈ మాక్ టెస్ట్ ఉపయోగపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, మట్టా అభిమానులు పాల్గొన్నారు.