TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, మండలం, జులై 01. తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జనసేన కమిటీ సభ్యులు మాట్లాడుతూ…. “వైద్య వృత్తి కేవలం ఉద్యోగం కాదు… అది మానవ సేవకు అంకితమైన గొప్ప బాధ్యత.” అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు అందరికీ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ గాడాల శ్రీనివాసులు మాట్లాడుతూ సమాజ ఆరోగ్య పరిరక్షణలో వైద్యుల అంకితభావం, నిస్వార్థ సేవలు అమూల్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ కె. మాధవ రెడ్డి, డాక్టర్ మణికంఠ గౌడ్, డాక్టర్ స్వాతి, రాష్ట్ర నాయకులు మచ్చ సుధాకర్, చిరాగ్, ప్రజీత్ గౌడ్తో పాటు పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొని వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం TV6 24/7 NEWS ను ఇప్పుడే Subscribe చేయండి.
https://youtube.com/@tv6247news?si=hXBJ8fxIBGIjHVF5