TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, మండలం, జులై 11. మధిర నియోజకవర్గంలోని ములుగుమాడు రెవెన్యూ గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన భూ సర్వే పూర్తికావడంతో జగన్నాధపురం రైతు ఆశీర్వాద సభలో 476 మందికి భూధార్ కార్డులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందించారని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రైతులు, మహిళలు, విద్యార్థులు, యువతను అభివృద్ధి పథంలో నడిపిస్తూ.. పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని అన్నారు.

గత పాలకులు తాము చేసిన తప్పులను, అబద్ధాలను ఈ ప్రభుత్వంపై రుద్దాలని చూస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో ఓడిపోయిన కూడా బుద్ధి లేకుండా ఈ ప్రభుత్వం మీద విషం చిమ్ముతూ వారి అక్కసు వెళ్ళకక్కుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రతి పిల్లర్‌లోనూ అవినీతి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజాప్రభుత్వంలో అన్నివర్గాల ప్రజలను అక్కున చేర్చుకుంటూ.. ఇళ్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని తలంచి, ఇప్పటికే విజయవంతంగా మొదటి, రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. ఇంకా మూడు, నాల్గవ విడత కూడా ఇస్తాం మని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం దిశగా భూ భారతి ద్వారా పైలట్ ప్రాజెక్టుగా 70 గ్రామాలను సర్వే చేస్తున్నాము., త్వరలో రాష్ట్రంలోని ప్రతి గజాన్ని సర్వే చేసి మ్యాపుతో జతచేసి, భూధార్ కార్డు కూడ ఇవ్వడం జరుగుతుందని జగన్నాధపురం రైతు ఆశీర్వాద సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *