TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, పెనుబల్లి మండలం, జులై 14. పెనుబల్లి మండలం కాకతీయ కమ్మ సేవా సమితి వారి ఆధ్వర్యంలో విఎం బంజర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నోట్బుక్స్ పెన్నులు, విఎం బంజర పంచాయతీ సిబ్బందికి రైన్ కోట్ల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ కాకతీయ కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ఇటీవల సామాజిక కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందని, కమిటీ సభ్యులను అభినందిస్తున్నామని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరెన్నో చేయాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు.
—————————
📍 TV624 24/7 NEWS
🌐 https://tv624-7news.in
మన ప్రాంత వార్తలు… మనకోసం…