TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు 62 వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు ఘనంగా నిర్వహించారు.
ఖమ్మం పట్టణం : ఖమ్మం డిసిసి కార్యాలయంలో మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు 62 వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య మంత్రివర్యులు మల్లు బట్టీ విక్రమార్క, ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ, సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు మట్టా రాగమయి దయానంద్ ఘనంగా నివాళులు అర్పించారు.

పెనుబల్లి మండలం : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల విఎం బంజర రింగ్ సెంటర్లో మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు గారి 62 వ వర్ధంతి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా మండలంలోని కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.