SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సెక్యూరిటీ ఏజెన్సీ లపై తనిఖీ నిర్వహించి పసర యాక్ట్ ప్రకారంగా లైసెన్సులు లేకుండా, ప్రైవేటు ఏజెన్సీలను నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులపై కేసుల నమోదుకు చర్యలు చేపట్టడమైనది .
సెక్యూరిటీ ఏజెన్సీల వివరాలు నిర్వహిస్తున్న 1)వీరెల్లి నవనీత్ చౌదరి సెక్యూరిటీ & హౌస్ కీపింగ్, మ్యాన్ పవర్ సర్వీసెస్- వీరెల్లి శ్రీనివాసరావు, 2) ASP సెక్యూరిటీ మరియు హౌస్ కీపింగ్ సర్వీసెస్- P. సుభాష్, 3) MR సెక్యూరిటీ హౌస్, కీపింగ్ సర్వీసెస్…. గొల్లమందల మంగయ్య, సమైక్య హౌస్ కీపింగ్ సర్వీసెస్ – యజమాని మందాడి సామ్రాజ్యం. వీరందరూ కూడా గత కొంతకాలం నుండి PSARA యాక్ట్ ఉత్తర్వులను ఉల్లంఘించి కొంతమంది వ్యక్తులకు ప్రైవేట్ గా సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు కల్పిస్తున్నందున వీరందరిపై కేసు నమోదుకు చర్యలు తీసుకొనబడినది.
ఇలాంటి సెక్యూరిటీ ఏజెన్సీలు ఎవరైనా PSARA యాక్ట్ ద్వారా లైసెన్సులు పొందకుండా నిర్వహిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని అని ఖమ్మం టూ టౌన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ హెచ్చరించారు.