TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్ – నాణ్యమైన వ్యవసాయ యంత్రాలు అందించడం ఎంతో అవసరమని తల్లాడలో నూతనంగా ఏర్పాటు చేసిన విజయసాయి లక్ష్మీ ఆటోమొబైల్స్, ఎంఎస్ ట్రాక్టర్ షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన టిజిఐడిసి చైర్మన్ మువ్వా విజయబాబు అన్నారు.

తల్లాడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన విజయసాయి లక్ష్మీ ఆటోమొబైల్స్, ఎంఎస్ ట్రాక్టర్ షోరూమ్ ను టిజిఐడిసి చైర్మన్ మువ్వా విజయబాబు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి, మువ్వా అభిమానులు పాల్గొన్నారు.