TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, సత్తుపల్లి మండలం, జూన్ 20. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో ఓ ఇంట్లో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. దీనితో అక్రమంగా నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్లను బాటిల్స్ ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
బుగ్గపాడు గ్రామంలో గ్యాస్ సిలిండర్లు, మద్యం బాటిల్స్ నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో కల్లూరు ఏసిపి వసుంధర యాదవ్ ఆదేశాల వరకు సత్తుపల్లి పోలీస్ సిబ్బంది బుగ్గుపాడు గ్రామంలోని వీర రాఘవులు ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 20 గ్యాస్ సిలిండర్లను 1,50,000 విలువచేసే 730 బాటిల్స్ ను పోలీసు వారు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు వారు పంచుల సమక్షంలో వీర రాఘవులు విచారించగా తను అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు ఒప్పుకోవడంతో అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.