TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, వేంసూరు మండలం, జూన్ 22. యువత ఉజ్జ్వల భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా రూపుమాపేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వేంసూర్ ఎస్సై కవిత అన్నారు. కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఆదేశాల మేరకు వేంసూరు లోని అడసర్లపాడు జిల్లా పరిషత్ స్కూల్ విద్యార్థులకు యాంటీ డ్రగ్ పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఎస్సై కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎస్సై కవిత మాట్లాడుతూ… మత్తు పదార్థాల వినియోగం వ్యక్తి జీవితానికే కాకుండా కుటుంబం, సమాజం, దేశ భవిష్యత్తుపై కూడా తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చదువు, క్రమశిక్షణ, దేశ సేవ వైపు దృష్టి సారించాలని సూచించారు. యువతను మత్తు పదార్థాల ముప్పు నుంచి రక్షించి, ఆరోగ్యవంతమైన, బాధ్యతాయుత సమాజాన్ని నిర్మించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని ఎస్ఐ కవిత పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *