TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, ఖమ్మం టౌన్, జూన్ 22. యువత మాదకద్రవ్యాల ఉచ్చులో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఖమ్మం టౌన్ ఎసిపి రమణమూర్తి అన్నారు. మత్తు పదార్దాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నగరంలోని స్టెమ్ పార్క్ జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎసిపి రమణమూర్తి మాట్లాడుతూ.. దేశ భవిష్యత్ యువతపై ఆధారపడి ఉందని, యువతపై మాదక ద్రవ్యాల దుష్ప్రభావం పడకుండా జాగ్రత్త పడడం మన అందరి బాధ్యత అని అన్నారు.
చెడు స్నేహాల వల్ల లేదా పరిస్థితుల ప్రభావంతో తాత్కాలిక ఆనందం కోసం గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటుపడితే అనేక రుగ్మతల భారిన పడతారన్నారు. మాదకద్రవ్యాలు సేవించడం, సరఫరా చేయడం, తయారీ, క్రయవిక్రయాలు అన్నీ క్రిమినల్ నేరాలని.. కఠినశిక్షలు వుంటాయని పేర్కొన్నారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడిన వాళ్లు వాటి నుంచి విముక్తి కోసం స్వయంగా ముందుకు వస్తే వారిపై ఎలాంటి నేర విచారణా ఉండదన్నారు. ఉచితంగా వైద్య సహాయం అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో అర్బన్ ఇన్స్పెక్టర్ భానుప్రకాష్, ప్రిన్సిపాల్ శ్రీధర్ పాల్గొన్నారు.