TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పెనుబల్లి మండలం, జులై 10. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటున్న మధిర నియోజకవర్గంలోని రైతు ఆశీర్వాద సభకు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి వందలాది బస్సుల్లో వేలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మట్టా దయానంద్ అభిమానులు భారీగా తరలివెళ్లారు.

ఈ సందర్భంగా పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ… పెనుబల్లి మండలం నుండి ప్రజలు స్వచ్ఛందంగా సీఎం రేవంత్ రెడ్డి సభకు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారని తెలిపారు.
సభ విజయవంతం కావడానికి నియోజకవర్గం నలుమూలల నుంచి కార్యకర్తలు ఉత్సాహంగా తరలివెళ్లారని పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *