మమTV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, సత్తుపల్లి, జులై 16: సత్తుపల్లి మండలం యతాలకుంటలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి పరిశీలించి నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ మంత్రులకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.
అనంతరం మంత్రులు మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి రైతులకు శాశ్వత సాగునీరు అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. గత రెండేళ్లలో రూ.1,000 కోట్ల నిధులు విడుదల చేసి పనులను వేగంగా పూర్తి చేస్తుండగా, ప్రస్తుతం 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నట్లు తెలిపారు. గోదావరి జలాలను వృథా కాకుండా వినియోగించి రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య , రాందాస్ నాయక్, తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్, కల్లూరు సబ్ కలెక్టర్, ఎస్పీ, ఏసీపీ, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు, డీసీసీ అధ్యక్షురాలు దేవి ప్రసన్న, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.