TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. వేంసూరు, జులై 31: వేంసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ రూ.500 నోట్లను అసలైనవిగా చలామణి చేస్తున్న ముఠాను వేంసూరు పోలీసులు ఛేదించి ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ నెల 21న కందుకూరు గ్రామానికి చెందిన ఓ కిరాణా వ్యాపారిని మోసం చేసి రూ.18 వేల నగదు ఇచ్చి అదే మొత్తాన్ని ఫోన్‌పే ద్వారా తమ ఖాతాకు బదిలీ చేయించుకున్నారు.

అనంతరం బ్యాంకులో డిపాజిట్ చేసిన ఆ నగదులో 18 నకిలీ రూ.500 నోట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించడంతో బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో జూలై 30న ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల విచారణలో ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని అసలు నగదుకు బదులుగా అధిక మొత్తంలో నకిలీ నోట్లను సరఫరా చేసి ఖమ్మం, సత్తుపల్లి, వేంసూరు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో చలామణి చేసినట్లు వెల్లడైంది. నిందితుల వద్ద నుంచి 59 నకిలీ రూ.500 నోట్లు, 7 మొబైల్ ఫోన్లు, ఒక మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితులకు గతంలో కూడా నకిలీ కరెన్సీ కేసుల్లో అరెస్టు అయిన చరిత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కమిషనర్ సునీల్ దత్, ఏసీపీ వసుంధర యాదవ్ పర్యవేక్షణలో సత్తుపల్లి రూరల్ సీఐ ఎం.ఎల్. ముత్తిలింగయ్య ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతుండగా, నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడైన జుజ్జునూరి రవి గతంలో నకిలీ కరెన్సీ నోట్లను సరఫరా చేయుచుండగా మంచిర్యాల జిల్లా లక్షట్ పేట పోలీస్ స్టేషన్ నందు అరెస్ట్ అయి బెయిల్ పై బయటకి వచ్చినాడు. కొవ్వూరి వినోద్ సతీష్ కుమార్ రెడ్డి గతంలో హైదరాబాద్ సిటీ యందు దొంగ నోట్లు చలామణి చేయుచుండగా, సైబరాబాద్ కమిషనరేట్ లోని రాయదుర్గం పోలీసు వారు అతని అరెస్టు చేసి జైలుకు పంపారు. వీరిద్దరికీ నేరచరిత్ర ఉంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *