TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, పెనుబల్లి మండలం, సెప్టెంబర్ 08. వినాయక చవితి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా భక్తులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న వేళ, పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఈనెల 14వ తేదీన జరగనున్న వినాయక చవితి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు పెనుబల్లి మండలం వి.ఎం. బంజర ఎస్సై ఎస్.కే. షాకీర్ పలు మార్గదర్శకాలను విడుదల చేశారు.
వినాయక మండపాలు ఏర్పాటు చేసే కమిటీ సభ్యులు తప్పనిసరిగా పోలీసు వారి అనుమతులు తీసుకోవాలని, శాంతి భద్రతలను కాపాడుతూ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా సౌండ్ సిస్టమ్ వినియోగంలో సమయ పరిమితులు పాటించాలి, నిమజ్జనం చేసేటప్పుడు ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేయాలి, విద్యుత్ కనెక్షన్లు సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
అలాగే, పర్యావరణ హిత గణేశ విగ్రహాలనే ఉపయోగించాలని, నిమజ్జన సమయంలో కూడా పోలీస్ వారి సూచనలు పాటించాలని కోరారు. ఈ నియమాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విఎం బంజర్ ఎస్సై షాకీర్ హెచ్చరించారు.
#tv6247news #penuballi #telangananews #khammam #telugunews #sattupalli
—————————
📍 TV624 24/7 NEWS
🌐 https://tv624-7news.in
మన ప్రాంత వార్తలు… మనకోసం…