పెనుబల్లిలో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పెనుబల్లి మండలం, సెప్టెంబర్ మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన శ్రీ గణనాథుని విగ్రహాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన గణనాథునికి కూడా పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా డాక్టర్ మట్టా దయానంద్ మాట్లాడుతూ… ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి గణనాథునికి పూజలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్లాస్టిక్‌ను వినియోగించకుండా పర్యావరణహితంగా వినాయక నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు.

ప్రస్తుత కాలంలో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, మట్టి విగ్రహాల ఏర్పాటుతో పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో పాటు పర్యావరణహితంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు, పెనుబల్లి పట్టణ నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య పెద్దలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *