TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, పెనుబల్లి మండలం, ఆగస్ట్ 29. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రానికి చెందిన అన్నపరెడ్డి సుంకయ్య శుక్రవారం అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద విజయ్ కుమార్ సుంకయ్య కుమారుడు శ్రీనివాస్ను పరామర్శించారు.
పితృవియోగంతో బాధపడుతున్న సుంకయ్య కుమారుడు శ్రీనివాస్ కు ధైర్యం చెప్పి, తండ్రి సుంకయ్య మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు మనోధైర్యంతో ఉండాలని హితవు చెప్పారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో పాటు, చీకటి రామారావు కేసరి శ్రీనివాస్ రెడ్డి, మిట్టపల్లి కిరణ్, మల్లెల రాజా, చిలక బత్తుల చెన్నారావు వంగా చంద్రశేఖర్, చెన్నకేశవులు, బొర్రా బాబు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు అన్నపరెడ్డి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఉన్నారు.
