TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్
త్యాగానికి, భక్తిప్రపత్తులకు, దైవచింతనకు నిలువెత్తు రూపం బక్రీద్ (ఈద్-ఉల్-జుహా) పండుగ అని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ దంపతులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ముస్లిం సోదర సోదరీమణులందరికీ వారు హృదయపూర్వక బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

మానవతావాదాన్ని చాటిచెప్పే గొప్ప పండుగ బక్రీద్. దేవునిపై అచంచలమైన విశ్వాసాన్ని, సమాజం పట్ల త్యాగనిరతిని ఈ పండుగ మనకు గుర్తుచేస్తుంది. ఉన్నదానిలో లేనివారికి దానం చేస్తూ, అందరి శ్రేయస్సును కోరే ఇస్లాం సంప్రదాయం ఎంతో గొప్పది. ఈ పవిత్ర పండుగ నియోజకవర్గ ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, మరియు సోదరభావాన్ని మరింత పెంపొందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఎమ్మెల్యే రాగమయి దయానందంపతులు తెలియజేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *