TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, కొణిజర్ల మండలం, జూన్ 23. కొణిజర్ల పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్ లో సిపి సునీల్ దత్త్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధిత ఫిర్యాదుదారులతో మాట్లాడారు. అనంతరం స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, విచారణ నివేదికలు, జనరల్‌ డైరీ రికార్డులను, సీజ్ చేసిన వాహనాలు, పరిసరాలను పరిశీలించారు.

సెక్టర్ పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలలో అవగాహన పెంపొందించాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన కేసులు, డయల్ 100 కాల్స్ ప్రతిస్పందన సమయం, పెండింగ్‌ కేసులు పరిశీలించారు. విధిగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ.. వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని సిబ్బందికి సూచించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *