TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, ఖమ్మం టౌన్, జూన్ 27.ఖమ్మం కమిషనరేట్ లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలోని వీవీసి టాటా మోటార్స్ సర్వీస్ సెంటర్ నుంచి లాకారం ట్యాంక్ బండ్ వరకు అవగాహన రన్ ర్యాలీని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ , పోలీస్ కమిషనర్ సునీల్ దత్ , మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఘనంగా ప్రారంభించారు.
“మాదకద్రవ్యాల జోలికి వెళ్లం, డ్రగ్స్కు వ్యతిరేకంగా పనిచేస్తాం” అని ప్రత్యేకంగా యాంటీ డ్రగ్ సోల్జర్గా ప్రతిజ్ఞ చేయించారు.’ ‘సే ఎస్ టు లైఫ్, నో టు డ్రగ్స్’ అనే నినాదాలను ప్రతి ఒక్కరిలోకీ తీసుకువెళ్లేలా సైన్ బోర్డుపై సంతకం చేసేలా ఏర్పాటు చేసి ప్రచారాలు చేపట్టారు.