TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, రఘునాథపాలెం మండలం. జూన్ 25. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే ఇసుక మాఫియాపై కఠిన చర్యలు… క్రిమినల్ కేసులు తప్పవని సీఐ ఉస్మాన్ షరీఫ్ అన్నారు. ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి చెందిన సహజ వనరులైన ఇసుకను అక్రమంగా తరలిస్తూ…. ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం కలిగిస్తూ.. వ్యవస్థీకృత కార్యకలాపాలను కొనసాగిస్తున్న ఇసుక మాఫియాపై రఘునాథ పాలెం పోలీసులు సీఐ ఉస్మాన్ షరీఫ్ ఆధ్వర్యంలో కఠిన చర్యలు చేపట్టారు.

రఘునాథ పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన వాహన తనిఖీలలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారుపేట రీచ్ నుండి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు, మైనింగ్ పర్మిట్లు, ట్రాన్స్‌పోర్ట్ చలానాలు, ఈ-వే బిల్లులు లేకుండా సుమారు 112 టన్నుల ఇసుకను మూడు లారీల్లో అక్రమంగా తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

ప్రజలు కూడా అక్రమ ఇసుక రవాణా లేదా వ్యాపారం, అసాంఘిక కార్యకలాపాల గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేసి చట్ట పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఖమ్మం పోలీసులు విజ్ఞప్తి చేశారు. చట్టాన్ని ధిక్కరించే వారికి కఠిన శిక్షలు తప్పవు. అక్రమ ఇసుక రవాణా ఏ రూపంలో చేసినా సహించబడదని సిఐ ఉస్మాన్ షరీఫ్ హెచ్చరికలు జారీ చేశారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *